calender_icon.png 23 September, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మాజీ సర్పంచ్ ప్రెస్‌మీటా..?

23-09-2025 01:07:59 AM

ప్రతాప్ రెడ్డి వెంచర్ వల్లే రోడ్లపైకి ఊర చెరువు వరద నీరు 

గజ్వేల్, సెప్టెంబర్ 22 : గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో వెంచర్ వ్యాపారాలపై మాజీ సర్పంచ్ ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటని గజ్వేల్ బిజెపి నాయకులు ప్రశ్నించారు. సో మవారం బిజెపి పట్టణాధ్యక్షుడు మనోహర్ యాదవ్, నాయకులు గాడిపల్లి అనుప్ విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బూరుగుపల్లి మా జీ సర్పంచ్ విజయవర్ధన్ రెడ్డి ఏ అధికారం తో ప్రెస్ మీట్ పెట్టారని ప్రశ్నించారు.

ప్రతా ప్ రెడ్డి వెంచర్ వల్లే ఊర చెరువు నీళ్లు వస్తున్నాయని, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆ వెంచర్ కి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని బిజెపి నాయకులు గాడిపల్లి అ నుప్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలోనే ప్రతాప్ రెడ్డి వెంచర్ చేశారని ఆ వెంచర్ పై 2012లోనే కాంగ్రెస్ నాయకులు కేసులు వేశారని గుర్తు చేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదనీ, ప్రతాప్ రెడ్డి డ బ్బుల మూటలు దాచిపెట్టడం వల్లే ఎంపీ ఎ న్నికల్లో మాజీ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి ఓటమి పాలయ్యారని, ప్రతాప్ రెడ్డి లాంటి నాయకుల వల్లే బిఆర్‌ఎస్ నుండి ముఖ్య కార్యక ర్తలు బయటకు వెళ్తున్నారని ఆరోపించారు.

ప్రజ్ఞాపూర్ ఊర చెరువు సమీపంలోని ప్రతా ప్ రెడ్డి వెంచర్ వల్లే వరద నీరు నిలుస్తుందని,రూ. 14కోట్లు కేటాయించామని చెప్పిన బి ఆర్ ఎస్ నాయకులు పదేళ్లుగా ఎందుకు నాలాలు అభివృద్ధి చేయలేదని బిజెపి పట్ట ణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ ప్రశ్నించా రు.

ఒక వార్డు మెంబర్ గా గెలవని ప్రతాప్ రెడ్డి అనుచరులు బిజేపి నాయకులను విమర్శించడం సిగ్గుచేటన్నారు. బిజెపి 2 ఓట్ల నుండి మొదలుకొని జాతీయస్థాయిలో పా లన చేసే పార్టీగా ఎదిగిందన్నారు. బిజెపి పా ర్టీ జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రామచంద్ర చారి, శివకుమార్, మడ్గురి నరసింహ తదితరులు పాల్గొన్నారు.