09-05-2025 03:12:33 AM
మృతుల్లో అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి
హైదరాబాద్, మే 8: ఉత్తరాఖండ్‌లో గు రువారం ఉదయం పర్యాటకులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలిం ది. ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తుండగా ఈ ప్ర మాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, వీరిలో ఏపీకి చెందినవారు ఇద్దరు ఉన్నారు. మరో ఏపీ వ్యక్తికి గాయాలయ్యాయి. అనంతపురం ఎంపీ లక్ష్మీనారా యణ సోదరి వేదవతితో పాటు విజయారెడ్డి అనే మహిళ ఈ ప్రమాదంలో మృతిచెందినట్టు అధికారులు నిర్ధారించారు. వేదవతి భర్త భాస్కర్ గాయాలతో బయటపడ్డాడు. అతన్ని చికిత్సకోసం రుషికేశ్ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఏడుగురు ప్రయాణిస్తున్నారు.