04-11-2025 04:19:20 PM
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఘనపూర్, కర్దనూరు, వెలిమల, తెల్లాపూర్ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, యుజిడీలు, ప్రహరీ గోడల నిర్మాణ పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ పనులు మొత్తం రూ.7 కోట్ల 20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్రాథమిక వసతులు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి కాలనీ, ప్రతి వీధి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తామన్నారు. ప్రజల సౌకర్యాల కోసం నిధులు కేటాయించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.