15-07-2025 06:01:26 PM
సిద్దిపేట క్రైం: అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, మాటలు నమ్మవద్దని సిద్దిపేట త్రీ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు విద్యార్థులకు సూచించారు. మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలపై మంగళవారం రంగదాంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీటీమ్ ద్వారా ఎలా రక్షణ పొందవచ్చు, ర్యాగింగ్, ఈవ్టీజింగ్, పోక్సో, హ్యుమెన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, నూతన చట్టాలను వివరించారు. సోషల్ మీడియా, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు. ఎవరైనా మహిళలను వేధిస్తే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ షీటీమ్ నెంబర్ (8712667434)కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.