30-08-2025 12:49:53 AM
శేరిలింగంపల్లి, ఆగస్ట్ 29ఫ అభివృద్ధి,సంక్షేమం అగకూడదనే ఉదేశ్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్ కాలనీ లో రూ.18 కోట్ల 92 లక్షల రూపాయలతో పటేల్ చెరువు అలుగు నుండి గంగారం చెరువు వరకు నిర్మిస్తున్న ఆర్ సి సి బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను,ఆర్ సిసి బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం నాల విస్తరణ నిర్మాణం పనులకు కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి , ఉప్పలపాటి శ్రీకాంత్ , దొడ్ల వెంకటేష్ గౌడ్ లతో కలిసి పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని, నాల విస్తరణ పై ప్రణాళికలు రూపొందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గాంధీ అధికారులను ఆదేశించారు.అభివృద్ధి,సంక్షేమం అగకూడదనే ఉదేశ్యం తో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని పనులలో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, స్థానిక కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు