17-09-2025 11:58:38 PM
సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా చిత్తలూరి పద్మ
కోదాడ: సూర్యాపేట జిల్లా ప్రభుత్వ వసతిగృహ సంక్షేమ హాస్టల్స్ నూతన కార్యవర్గాన్ని బుధవారం కోదాడ పట్టణంలోని టీఎన్జీవో భవనంలో ఆ సంఘ సూర్యపేట జిల్లా అధ్యక్షులు షేక్ జానీ మియా, సెక్రటరీ దున్నా శ్యామ్ ల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా కోదాడకు చెందిన చిత్తలూరి పద్మ, అసోసియేట్ అధ్యక్షులుగా వి.పద్మమ్మ, వైస్ ప్రెసిడెంట్లుగా నాగేందర్, అంజయ్య లతీమున్, కవిత, మమతలతో పటు సెక్రటరీలుగా ముత్యాల రావు, భాస్కర్, రవి,వాణి జోత్స్నా, సరితా, సాయిరాంలతో పాటు తదితర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి నియామక పత్రాలు ఇచ్చి ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు టీఎన్జీవో సంఘం అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని భరోసాని ఇచ్చారు. సమన్వయంతో సంఘాన్ని కలిసికట్టుగా పనిచేసి బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు.