calender_icon.png 18 September, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 26 నుండి రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాంకింగ్ క్యారమ్ పోటీలు

18-09-2025 12:03:48 AM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సీనియర్, జూనియర్ ఓపెన్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ పోటీలు ఈనెల 26 నుండి 29వ తేదీ వరకు హైదరాబాదులోని ఖైరతాబాద్ లో జరుగుతాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ఆర్. బాలరాజు ఆర్గనైజింగ్ కార్యదర్శి టి. రాజన్న తెలిపారు.  ఖైరతాబాద్ లోని ఆనంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ ఆడిటోరియంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. పురుషులు, మహిళలు, వెటరన్ పురుషులు, మహిళలకు సింగిల్స్ పోటీలు,  జూనియర్ (అండర్-18), యూత్ (అండర్-21) బాలురు, బాలికలకు సింగిల్స్ పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలలో పాల్గొనాలనుకునేవారు ఈనెల 23వ తేదీలోగా తమ ఎంట్రీలను పంపించాలని వారు కోరారు. వివరాలకు 9440010404 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని వారు కోరారు.