calender_icon.png 6 December, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

06-12-2025 12:00:43 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 54, 6వ డివిజన్ లలో రూ.4.26 కోట్లతో మంచి నీటీ పైప్ లైన్, సీసీ డ్రైన్, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సుమారుగా 4 కోట్ల పై చిలుకు నిధులతో ఆయా డివిజన్ లలో పనులు చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే ఆయా డివిజన్ లో పలు కాలనీలో నేరుగా పర్యటిస్తూ పలు సమస్యలు నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. 54, 6వ డివిజన్ లలో సొంత డివిజన్లు అని రెండు డివిజన్ లలో ప్రత్యేక దృష్టితో నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులను చేస్తున్నామని తెలిపారు. రానున్న అతికొద్ది రోజుల్లోనే రూ 1000 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించనున్నారని తెలిపారు.

పీసీసీ హోదాలో హనుమకొండ నగరానికి వచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలలో అన్నింటినీ నెరవేర్చే దిశగా పనులు చేపట్టారని అన్నారు. పోచమ్మకుంట శ్మశాన వాటిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి కొరకు ప్రత్యేక దృష్టితో కిరాయి ఇండ్లలో ఉన్న కుటుంబాలకు మరణం భారం కాకూడదని ప్రత్యేక గదులను ఏర్పాటుచేయడం కోసం శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కాలనీ ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.