06-12-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 5 (విజయ క్రాంతి): బస్సులో ప్రయనికుని వద్ద నుండి డబ్బుల బ్యాగును దొంగిలించిన నిందుతుని వద్ద 3,92,500/-రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకునారు.ఈ సందర్భంగా డిఎ స్పీ మాట్లాడుతూ....వేములవాడకు చెందిన నార్ల శ్రీనివాస్ హైదరాబాదులోని హోల్సేల్ దుకాణాలకు చెల్లించాల్సిన 3,97,500/- రూ. నగదు తో పాటు తన ఆధార్ కార్డు, పా న్ కార్డు, హెల్త్ కార్డు, ప్రెస్ అక్రిడేషన్ కార్డు, బస్ పాస్, రెండు చెక్కులు ఉన్న పర్సును క్యాష్ బ్యాగ్లో ఉంచుకొని డిసెంబర్ 3న ఉ దయం 11:40 గంటలకు వేములవాడ బ స్టాండ్ వద్ద బ స్సులో ఎక్కారు.
లాస్ట్ సీట్ కింద బ్యాగ్ ఉం చి కూర్చున్న ఆయన కొద్దిసే పటికి ముందు సీటుకు మారి కూర్చొన్నారు.అందాదా 12:15 గంటలకు తంగళ్ళపల్లి వద్దకు చేరుకునే సరికి వెనుక సీటుకు వెళ్లి చూసినప్పుడు బ్యాగ్ కనిపించకపోవడంతో కండక్టర్ను విచారించగా, సిరిసి ల్ల వద్ద ఒక వ్యక్తి బస్సు దిగినట్టు చెప్పారు.
దీంతో శ్రీనివాస్ సిరిసిల్ల పట్టణ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకొని పోలీస్ సిబ్బంది వెంటనే రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి వేములవాడ నుండి సిరిసిల్ల వరకు ఉన్న అన్ని సి సి టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని వేములవాడ మండలం రుంద్రారం గ్రామానికి చెం దిన బండారి బాలరాజు గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు తాను వేములవాడలోనే సిద్దిపేట్ బస్సులో ఎక్కి వెనుక సీటులో కూర్చున్నట్టు, పిర్యాది తన పక్కనే బ్యాగ్ను సీట్ కింద పెట్టినట్టు గమనించి అవకాశం దొరికినప్పుడు బ్యాగ్లో ఉన్న డబ్బులను చూసి దొంగతనం చేయాలని భావించి, సిద్దిపేట్ టికెట్ తీసుకున్నప్పటికీ చంద్రంపేట్ వద్ద దిగానని ఒప్పుకున్నాడు.
పోలీసులు నిందితుడి వద్ద నుండి మొత్తం నగదును రికవరీ చేసి, నిందితుడిని రిమాండ్కు తరలించ డం జరిగింది డీఎస్పీ తెలిపారు.బస్సులలో ప్రయాణించేటప్పుడు చుట్టూ ప్రక్కల ఉన్న వారిని గమనించి విలువైన వస్తువులు, నగలు మరియు డబ్బులు ఉన్న బ్యాగులను వారి యొక్క చేతిలోనే పట్టుకొని జాగ్రత్తగా ఉండాలని, ఇతరులు ఏమైనా తును బండారాలు గని వాటర్ గాని ఇస్తే తిసుకోకుడదని తెలిపినారు.