calender_icon.png 29 January, 2026 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.3.30 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

29-01-2026 12:41:57 AM

  1. 30 లక్షల సొంత నిధులతో షాపింగ్ కాంప్లెక్స్

ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

పటాన్ చెరు, జనవరి 28 :నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు డివిజన్ సమగ్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో మూడు కోట్ల 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, ప్రహరీ గోడల నిర్మాణ ప నులకు బుధవారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శరవేగంగా విస్తరిస్తున్న పటాన్ చెరు డివిజన్, జేపీ కాలనీ డివిజన్ల పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధు లు కేటాయిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా సిసిరోడ్లు, యూజీడిలు, పార్కుల అభి వృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 

రూ.30 లక్షల సొంత నిధులతో షాపింగ్ కాంప్లెక్స్..

పటాన్ చెరు డివిజన్ పరిధిలోని చోటి మసీద్ కమిటీ ఆధ్వర్యంలో గల స్థలంలో 30 లక్షల రూపాయల సొంత నిధులతో షా పింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎల్లప్పుడూ తాను ముందుంటానని తెలిపారు. త్వరితగతిన ప నులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని తెలిపారు. షాపింగ్ కాంప్లెక్ కిరాయిల ద్వారా మసీదు నిర్వహణకు ఆదాయం సమకూరుతుందని తెలిపా రు. 

ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్ చెరు డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, మాజీ ఎం పీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నా యకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, మైనార్టీ మత పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.