calender_icon.png 29 January, 2026 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవర్లకు కంటి పరీక్షలు

29-01-2026 12:41:29 AM

నారాయణపేట, క్రైం .జనవరి28, ( విజయక్రాంతి) : రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా భారీ వాహన డ్రైవరులకు కం టి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా రవాణా అధికారి మేఘా గాంధీ తెలిపారు. 2026లో భాగంగా బుధవారం 28వ రోజున భారీ వాహనాల డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్ల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రొఫెసర్ డాక్టర్ పి. రాందాస్, క్యాంప్ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్, డాక్టర్ సాదిక్ మరియు వారి బృం దం వచ్చి డ్రైవర్లందరికీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఏ సిబ్బంది జి. మేఘా గాంధీ డిటిఓ, సాయి తేజ రెడ్డి ఏఎంవిఐ, విద్యా సాగర్ ఏఓ, రాజేష్ ఆర్టిఏ సభ్యు లు, సృజన్, రవి, నరహరి డిబిఏలు మరి యు సాధారణ ప్రజలు పాల్గొన్నారు.