calender_icon.png 9 January, 2026 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం

08-01-2026 12:17:22 AM

  1. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ పోటీలు

రాష్ట్ర క్రీడలు,యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

మణుగూరు, జనవరి 7 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర కీర్తిని చాటడమే లక్ష్యంగా ముందుకు సాగు తోందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. బుధవారం మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం, క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  సీఎం కప్ క్రీడా జ్యోతిని వెలిగించి, ర్యాలీని ప్రారంభించారు.

అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ, దశాబ్దకాలం నుండి విస్మరించబడ్డ క్రీడారంగం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేగవంతంగా పురోగమాణంలో పయనిస్తోందని, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి విశేష  కృషి జరుగుతోందని చెప్పారు.  ప్రభుత్వ  క్రీడా విధానం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడా రంగానికి క్రీడాకారులకు మంచి భవిష్యత్తును అంద జేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి, మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారిని ప్రపంచ ఛాంపియన్లుగా తీర్చి దిద్దేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు ఎంతో దొహద పడతాయన్నారు. పల్లెల్లోని యువతకు సరైన ప్రోత్సాహం లభిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని, అందుకే ప్రభుత్వం మండలాలు, గ్రామాల వారీగా క్రీడా ప్రాంగణాలను అభి వృద్ధి చేస్తోందని చెప్పారు.

పేదరికంతో ఏ ఒక్క క్రీడాకారుడు ఆగిపోకూడదని, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా స్టేడియాలను ఆధునీకరిస్తున్నామని, కోచ్ల నియామకంపై కూడా దృష్టి సారించామని మంత్రి వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వ ర్లు మాట్లాడుతూ, గ్రామీణ క్రీడలను వెలికి తీసేందుకే  ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసర మేనని, క్రీడల వల్ల కోటా కింద ఉద్యోగ అవకాశాలు వస్తాయని  తెలిపారు.

కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, తాహసిల్దార్ అద్దంకి  నరేష్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీఓ వెంక టేశ్వర్లు, మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షు లు పీరినాకి నవీన్, శివ సైదులు, సమితి సింగారం సర్పంచ్ మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్,శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, సర్పంచులు ఎనిక సరిత, పూణెం రమేష్, జగడి ప్రసా ద్, కారం పూజిత, మడకం కృష్ణ, పాల్వంచ రాములు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.