calender_icon.png 27 October, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం

27-10-2025 12:20:46 AM

  1. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రామాలయం నిర్మాణానికి భూమి పూజ 

అమీన్పూర్, అక్టోబర్ 26 :ప్రజలలో భక్తి భావం పెంపొందించేందుకు నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని గ్రీన్ మెడోస్ కాలనీలో నూతనంగా ని ర్మించ తలపెట్టిన రామాలయం భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మించబోయే రామాల యం నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిప ల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి , మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.