27-10-2025 12:19:50 AM
ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
చిన్నచింత కుంట, అక్టోబర్ 26: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల కొంగుబంగారం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉదయం ఆత్మకూరులోని ఎస్బీఐ బ్యాంకులో ఉన్న స్వామివారి స్వర్ణాభరణాల ఊరేగింపు వైభవంగా సాగింది.
ఈ వేడుకలలోరాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి అబ్బారాణాల ఊరేగింపు కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు ప్రతినిధులతో పాటు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అలంకార ఉత్సవం, శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి అశ్వవాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.