27-10-2025 12:21:38 AM
- మాజీ సర్పంచును అరెస్టు చేయాలి
- మృతదేహంతో రోడ్డుపై ధర్నా
- 50 లక్షలు కంపెనీ ఇవ్వాలి
- పోలీసులు న్యాయం చేయకుంటే డిజిపి కార్యాలయం ముట్టడిస్తాం
గోపాలపేట అక్టోబర్26: పోలీసుల బెదిరింపులతో మనస్థాపానికి గురై ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు మృతదేహంతో ధర్నా చేపట్టిన సంఘటన వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లాలోని ఏదుల మండల కేంద్రానికి చెందిన కొమ్ము ఆంజనేయులు 45 భార్య అంజనమ్మ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
రైతు ఆంజనేయులుకు ఉన్న పొలం లో కొద్దిగా ఏదుల పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ నిర్మాణంలో పోగా కొద్దిగా మిగిలింది. మృతి చెందిన ఆంజనేయులు కొద్దిపాటు ఉన్న పొలంలో పంట సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఏదుల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి కే ఎన్ ఆర్ కంపెనీకి సబ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే ఏదుల పాలమూరు రంగారెడ్డి రిజర్వాయ ర్ నిర్మాణానికి రోడ్డు పనుల కోసం మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి కాంట్రాక్ట్ తీసుకున్నారు. రోడ్డు పనుల కోసం టిప్పర్లు తో మట్టిని తరలిస్తున్నారు.
అయితే ఆ టిప్పర్లు రైతు కొమ్ము ఆం జనేయులు పొలం పైనుంచి వెళ్తున్నాయి. దీంతో ఆ రైతు తన వేసుకున్న మినుము పంట పాడైతుందని టిప్పర్లను ఆపాలని కాంట్రాక్టర్ కంపెనీకి ఆ రైతు తెలిపాడు. రైతు కన్యాయం జరుగుతుందని అదేమీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్ శ్రీనివా సరెడ్డి పోలీసులకు ఫోన్ లో రైతు ఆంజనేయులు ప్రభుత్వ ప నులను అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. రేవల్లి మండల పోలీసులు రైతు ఆంజనేయులు బెదిరింపులకు గురి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
టిప్పర్లను అడ్డుకుంటే అక్క డే చంపి పాతేస్తానని కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి ఫోన్లో బెదిరించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొమ్ము ఆంజనేయులు మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి హైదరాబాదుకు తరలించారు చికిత్స పొందుతూ రైతు ఆంజనేయులు మృతి చెందాడు. భార్య అంజనమ్మ ఇద్దరు ఆడపి ల్లలు కలిసి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. తన తండ్రి చావుకు కారణం మాజీ సర్పంచి శ్రీనివాసరెడ్డి పోలీసులేనని వారు తరచూ బె దిరించడం వల్లే మా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని కూతు ర్లు ఆరోపించారు.
ఈ విషయం తెలుసుకున్న పొలిటికల్ జేఏ సీ యుగంధర్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పొలిటికల్ జేఏసీ యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ అగ్రవర్గ కులా నికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు వెంట నే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని డిమాండ్ చేశారు. డబ్బులు సంపాదన కోసం కాంట్రాక్టర్లు ఇలాంటి అక్రమాలకు పాడ్పడుతూ పేద వర్గాలపై ఇజం చూపుతున్నారని అ న్నారు. రైతుకు నష్టం చేయడమే కాకుండా ఆ పొలంలోనే చం పి పార్టీ పెడతామని బెదిరింపులకు దిగడం ఏంటని ప్రశ్నించారు.
కాంట్రాక్టర్కు తోడుగా పోలీసులు కూడా వత్తాసు పలు కుతూ ప్రజలకు న్యాయం చేయకుండా బెదిరింపులు చేయడమేంటని అన్నారు. ప్రభుత్వం వెంటనే రైతు చావుకు కారణ మైన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మీ వెంటనే అరెస్టు చేసి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరా రు. ఈ రైతు ను బెదిరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పొలిటికల్ జేఏసీ జిల్లా కార్యదర్శి యుగేందర్ గౌడ్ డి మాండ్ చేశారు లేని పక్షంలో డిజిపి కార్యాలయాన్ని పెద్ద ఎ త్తున ముట్టడానికి ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కుటుంబ సభ్యులకు కంపెనీ 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.