calender_icon.png 20 January, 2026 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విదేశీ కరెన్సీతో మోసం

23-09-2024 01:10:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): విదేశీ కరెన్సీ నోట్లు అని చెప్పి, నకిలీ నోట్లతో అమాయకులను మోసం చేస్తున్న వారిపై బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండలోని పాన్ బ్రోకర్స్ షాప్ కౌంటర్‌లో ఇటీవల కొందరు నకిలీ దుబాయ్ దీరమ్స్ ఇచ్చి రూ.91 వేల ఇండియన్ కరెన్సీ తీసుకున్నారు. ఆ తర్వాత నిర్వాహకులు ఆ నోట్లు దుబాయ్ కరెన్సీ కాదని, అవి నకిలీవని గుర్తించి పోలీసులను ఆశ్రయిం చారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నది.