calender_icon.png 24 August, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సమస్యలపై ఎమ్మార్వోకు వినతి పత్రం

23-08-2025 08:16:53 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేయాలని శనివారం మండల తహసిల్దార్ వరప్రసాద్(Mandal Tehsildar Varaprasad)కు భాజపా నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల రూరల్ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు అమలు కానీ హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేసిందని, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతుందని, ప్రజల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచకపోవడంతో గ్రామాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

రైతులకు సన్న రకం ధాన్యానికి బోనస్ ఇస్తామని ఇప్పటివరకు రైతులకు అందలేదని, ఇప్పటికైనా గ్రామాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గ్రామాలలో దోమల బెడద కుక్కల బెడద కోతుల బెడద నివారించాలని, లేనిపక్షంలో భాజాప ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, బిజెపి రూరల్ మండల్ ఇన్చార్జ్ చిదుర సాయిలు, జిల్లా కౌన్సిల్ సభ్యులు తూప్తి శివప్రసాద్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చీకట్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.