calender_icon.png 24 August, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య మందలించిందని భర్త అదృశ్యం

23-08-2025 08:20:29 PM

మేడిపల్లి: ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నావని భార్య మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మేడిపల్లి గణేష్ నగర్ లో వేముల రూప తన భర్త నరేష్(30) గత నాలుగు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు. తన భర్త కొన్ని నెలలుగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇదే విషయంపై తన భార్య నిలదీయగా అతను ఆమెతో వాదించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి మరలా ఇంటికి రాలేదు. ఇట్టి విషయంపై తన భార్య మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని,ఇట్టి వ్యక్తి ఎవరికైనా కనబడితే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో  సమాచారం ఇవ్వాలని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.