calender_icon.png 24 August, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనాసక్తి పెంపొందించాలి: డా.బెల్లి యాదయ్య

23-08-2025 08:20:37 PM

నకిరేకల్,(విజయక్రాంతి): అంతరిక్ష పరిశోధనలు దేశం యొక్క మేధాశక్తికి ప్రతీకలని,విద్యార్థులు తమలోని విజ్ఞాన స్పృహను అంతరిక్షం వైపు మళ్లిస్తే దేశం మరింత శాస్త్రసాంకేతికాభివృద్ధిని సాధించగలదని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బేల్లి యాదయ్య పేర్కొన్నారు. శనివారం కళాశాలలో ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.సైన్సు అభివృద్ధిలో అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల సరసన మన దేశాన్ని నిలబెట్టిన ఘనత ఇస్రో శాస్త్రవేత్తలదన్నారు.రానున్న కాలంలో భారత్ అంతరిక్ష పరిశోధనారంగంలో మున్ముందుకు దూసుకుపోయేలా విద్యార్థుల్లో పరిశోధనాసక్తిని పెంపొందించే బాధ్యత విద్యాసంస్థలు తీసుకోవాలన్నారు. అనంతరం అంతరిక్ష పరిశోధన పై నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.