23-08-2025 08:17:48 PM
నకిరేకల్,(విజయక్రాంతి): రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక డిప్యూటీ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి, జిల్లా నాయకులు గజ్జి రవి మాట్లాడారు. ఫర్టిలైజర్స్ దుకాణాలలో యూరియా బస్తాలు ఉన్నప్పటికీ యాజమాన్యాలు యూరియా బస్తాలకు అదనపు ఫర్టిలైజర్స్ కొంటేనే ఇస్తామని లింకు పెట్టడంతో రైతు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి దుకాణాలను గుర్తించి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.