calender_icon.png 24 August, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమావాస్య అన్నప్రసాద వితరణకు విశేష స్పందన

23-08-2025 08:11:10 PM

మేడ్చల్ అర్బన్: అమావాస్య అన్న ప్రసాద వితరణ చేసేందుకు ఇటీవల కాలంలో ఎందరో సామాజిక కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. మేడ్చల్ పట్టణంలోని ఏడు గుడుల ఆలయం వద్ద గత 3 సంవత్సరాలుగా శ్రీపాద వల్లభ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు అన్న ప్రసాద వితరణ చేపడుతున్నారు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి సంబంధించిన రోజని, గత 3 సంవత్సరాలుగా అమావాస్య రోజున పలువురు దాతల సహాయంతో అన్నప్రసాద వితరణ చేపడుతున్నామని ట్రస్ట్ ఫౌండర్ తాళ్లపల్లి రమేష్ గుప్తా తెలిపారు.