23-08-2025 08:15:01 PM
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్
వలిగొండ,(విజయక్రాంతి): బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ నెల 25న ఇందిరాపార్కు వద్ద బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న చేపడుతున్న సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని విద్యార్థులతో కలిసి కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య, జిల్లా ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు సింగనబోయిన మల్లేశం పాల్గొని మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చినవన్నీ అమలు చేయాలని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలి లేకపోతే సమరమే అని అన్నారు. బీసీలు అంటే కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే భావిస్తున్నారని, బీసీలు సర్పంచులు అయితే కూడా చీర్నించుకోలేకపోతున్నారని అన్నారు. బీసీలకు 79 సంవత్సరాలుగా అన్యాయమే జరుగుతుందన్నారు.