calender_icon.png 24 August, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సందేహాలున్న వాటిపై ఫిర్యాదు చేస్తాం, తప్పేంటి?!

23-08-2025 08:28:11 PM

స్పందించాల్సిన బాధ్యత అధికారిగా మీపై ఉంది

మేడ్చల్ టౌన్ ప్లానింగ్ అధికారిపై సిపిఎం కార్యదర్శి ఫైర్

మేడ్చల్ అర్బన్: సామాన్యులు, సామాజిక కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తే పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నా లేకున్నా ఒకటే అని సిపిఎం మేడ్చల్ మండల కార్యదర్శి నరేష్ అన్నారు. పలు అంశాలపై ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు చేసిన వారికి మతిస్థిమితం లేదంటూ మేడ్చల్ మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి  రాధాకృష్ణ వ్యాఖ్యలు చేయడాన్నీ సిపిఎం పార్టీ కార్యదర్శి నరేష్ తీవ్రంగా ఖండించారు. సమస్యలపై ఫిర్యాదు చేస్తే మతిస్థిమితం లేదని వ్యాఖ్యలు చేసిన సదరు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డిపై ఉన్నత స్థాయి అధికారులు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నరేష్ డిమాండ్ చేశారు.

టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు చేసినా స్పందించకపోగా, ఫిర్యాదులు చేసిన వారికి మతిస్థిమితం లేదంటూ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చట్ట విరుద్ధమని నరేష్ శనివారం ఓ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో పార్కు స్థలాలను కబ్జా చేస్తున్నా ఏలాంటి చర్యలు అధికారులు తీసుకోవడం లేదని నరేష్ ఆరోపించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన అధికారి స్థానంలో ఉన్న రాధాకృష్ణారెడ్డి, మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో స్థానిక ప్రజలకు, నాయకులకు సందేహం ఉన్న అంశాలపై, ఫిర్యాదులు అందిన విశాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారిగా రాధాకృష్ణారెడ్డికి ఉందని సిపిఎం పార్టీ మేడ్చల్ మండల కార్యదర్శి నరేష్ గుర్తు చేశారు.