23-08-2025 08:13:57 PM
ఎస్సై రాజేష్..
జనగామ (విజయక్రాంతి): జనగామ కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో లీడర్స్ కార్యక్రమం స్థానిక నెహ్రూ పార్క్ సెయింట్ మేరీస్ పాఠశాలలోని విద్యార్థుల యొక్క నాయకత్వ లక్షణాలను వెలికి తీసే పనిలో భాగంగా ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థులకు ఎన్నికలను నిర్వహించి వారిలో గెలిచిన వారికి ఈరోజు పాఠశాలలో బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై రాజేష్(SI Rajesh) పాల్గొని వారికి బ్యాడ్జెస్ ఇచ్చి అభినందించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎస్సై రాజేష్, మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత విద్యార్థులపై చాలా ఉందని, విద్యార్థులు అన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ సమాజానికి ఎనలేని కృషి చేయాలని ప్రసంగించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ బసాని శ్రీధర్ రెడ్డి ప్రసంగిస్తూ నేటి బాలలే రేపటి పౌరులు అని పాఠశాల దశలోనే వారికి అన్ని విధాల విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. దీనిలో పిఈటి శ్రీధర్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.