07-11-2025 01:07:27 AM
బూర్గంపాడు,నవంబర్ 6,(విజయక్రాంతి):బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలోనిగ్రామపంచాయతీ కార్యాలయం నందు భద్రాచలం నేతాజీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంలో అపారమైన అనుభవం కలిగిన లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ గడ్డం శ్రీనివాస్ అవసరమైన వారికి ఉచితంగా షుగర్ పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు అందరు చేశారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి ఉచితంగా షుగర్ పరీక్ష చేసి ఉచితంగా మందులు అందరు చేసామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో అధునాతన వసతులతో కూడిన వైద్యం అందించాలనే లక్ష్యంతో భద్రాచల పట్టణంలో నేతాజీ హాస్పిటల్ ను ప్రారంభించమని తెలియజేశారు.
మా హాస్పిటల్ నందు ఎల్లప్పుడూ అనుభవం కలిగిన లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు గడ్డం, ఎముకల వైద్య నిపుణులు , ఆర్థోపెడిక్ డాక్టర్ హేమంత్ కాకర్ల ప్రతిరోజు అందుబాటులో ఉంటాలని తెలిపారు. అలాగే మా హాస్పిటల్ నందు జనరల్ సర్జరీ విభాగంలో చిన్న ఆపరేషన్, పెద్దా ఆపరేషన్ , గర్భాశయంలో గడ్డలకు, నీటి బుడగలు , 24 గంటల నొప్పి, గ్యాస్ సంబంధిత సమస్యలు,అలాగే ఆర్థోపెడిక్ లో అన్ని రకాల ఆపరేషన్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ నరసింహారెడ్డి, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.