calender_icon.png 7 November, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.4.5 కోట్లు స్వాహాపై నివేదిక కోరిన కలెక్టర్

07-11-2025 01:08:40 AM

కరీంనగర్ నవంబర్6(విజయక్రాంతి): కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో టీఎస్ ఎంఎస్‌ఐడిసి, నిధులు, హెచ్‌ఎఎస్, టీవీ వీపి, కాయకల్ప నిధుల్లో రూ. 4.5 కోట్ల రూపాయలకు ఎలాంటి బిల్లు లు, రసీదులు పెట్టకుండా నిధుల దుర్వినియోగానికి పాల్ప డిన సంఘటనను ’విజయక్రాంతి’ వెలుగులోకి తెచ్చింది.

ఈ కథనం పై స్పందించిన జిల్లా కలెక్టర్ వారం రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని ప్రస్తుత ఆసుపత్రి సూపరెండేంట్ ను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా హాస్పిటల్లో 2021 నుంచి 2024 వరకు జరిగిన అవినీతి, అక్ర మాలపై అప్ప టి జిల్లా వైద్యాధికారిని లలిత దేవి జరిపిన విచారణ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కదా మళ్ళీ నివేదిక ఎందుకని పిర్యా దు దారు బందారి శేఖర్ అంటున్నారు. తాజా నివేదికలో ఏముంటుందో చూడాలి.