calender_icon.png 26 September, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలకొండపల్లి మండలానికి ఉచిత వేరుశనగ విత్తనాలు

26-09-2025 12:05:53 AM

  1. మండలంలో 2500 ఎకరాలలో వేరుశనగ సాగు
  2. ప్రతి రైతుకు ఎకరా చొప్పున విత్తనం పంపిణీ
  3. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తలకొండపల్లి,సెప్టెంబర్ 25: తలకొండపల్లి మండలంలో రైతులు 2500 ఎకరాల లో వేరుశనగ సాగుచేస్తుంటారని,వారందరికి రాష్ట్ర ప్రభుత్వం ఎకరా చొప్పున వేరుశనగ విత్తనాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు.తలకొండపల్లి మండల కేంద్రంలోని పిఎసిఎస్ గోదామూలో ప్రభుత్వం నుండి మంజూరైన ఉచిత వేరుశన విత్తనాల పంపిణీ కార్యక్రమం గురువారం చేపట్టారు.

ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో గతంలో సైంటిస్టుల పర్యవేక్షణలో మట్టి నమూనాలను పరిశీలించి ’కత్రి లేపాక్షి’ రకం వేరుశనగ విత్తనాలు అనుకూలంగా ఉంటాయని గుర్తించినట్లు తెలిపారు.రంగారెడ్డి జిల్లాలో తలకొండపల్లి మండలానికి మాత్రమే ఉచిత వేరుశనగ విత్తనాలు మంజూరు చేసినట్లు చెప్పారు.

కాంగ్రేస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం లోని రైతులందరు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రణాళికా బద్దంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.ఇటీవల ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో నాపై,ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారని అలాంటి వాటిని సహించేది లేదని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కొందరిని రెచ్చగొట్టి వారితో మాట్లాడిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.

అలాంటి వారిని ప్రజలు గమనిస్తున్నారని వారికి తాగిన సమయంలో బుద్ది చెబుతారన్నారు.త్రిబులార్ ప్రాజెక్ట్ గత  కెసిఆర్ ప్రభుత్వం లోనే తెరమీదకు వచ్చిందని అన్నారు.అంతలోనే కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించినట్లు చెప్పారు.రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం అదికారం లోకి వచ్చిన వెంటనే కెసిఆర్ ఎంపిక చేసిన గత అలైన్మెంట్ ప్రకారమే సర్వే చేయించి అలాట్మెంట్ ఖరారు చేయడం జరిగిందన్నారు.

ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదని ఉద్ఘటించారు.ఆర్‌ఆర్‌ఆర్ లో భూములు కోల్పోతున్న రైతుల గురించి ముఖ్యమంత్రి తో మాట్లాడుతున్నామని చెప్పారు.అభివృద్దికి ఎవ్వరు అడ్డుపడవద్దు అని భూములు కోల్పోయి నష్టపోతున్న రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు.

ప్రతి పక్షాల కుట్రలో రైతులు భాగాస్వాములు కావద్దని రైతుల పక్షాన ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే నారాయణరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్మన్ గట్ల కేశవరెడ్డి,మార్కెట్ కమిటీ ఛైర్మన్ యాట గీతనర్సింహ,వైస్ ఛైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి,వ్యవసాయ శాఖ అదికారులు పద్మజ,

శోభారాణి, రేణుకచక్రవర్తిని మండల కాంగ్రేస్ పార్టీ అద్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపిటిసి దాసరి యాదయ్య,డైరెక్టర్ అంజయ్యగుప్త,బట్టు కిషన్ రెడ్డి,మోహన్ రెడ్డి,మాజీ సర్పంచ్ పయ్యవుల రమేశ్ యాదవ్,రవీందర్ యాదవ్,డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.