26-09-2025 12:04:36 AM
వాజేడు సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): వాజేడు మండల కేంద్రానికి చెందిన గిరిజన విద్యార్థిని అయిన తల్లడి నవ్య జ్ఞాపిక ను గురువారం భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు తన క్యాంప్ ఆఫీస్ నందు శాలువతో సన్మానించి హర్షం వ్యక్తం చేశారు.మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన తల్లడి నవ్య జ్ఞాపికకు ఎంబిబిఎస్ ఫ్రీ సీట్ రావడంతో మండల కాంగ్రెస్ పార్టీ తరపున ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థినికి చదువు కొరకై 16 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వ సహాయం అందించగలరని కోరారు. సానుకూలంగా స్పందించిన వెంకటరావు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వము నుండి సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాజేడు మండల మాజీ జడ్పిటిసి తల్లడి పుష్పలత, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నమెల్లయ్య తదితరులు పాల్గొన్నారు.