calender_icon.png 22 May, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్, హరీశ్‌రావులకు నోటీసులు

22-05-2025 12:27:47 AM

- బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్

ముషీరాబాద్, మే 21 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు ఇచ్చారని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నగేష్ ముదిరాజ్ అన్నారు.

ఈ మేరకు బుధవారం రాంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా  సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ సర్కార్ ఇచ్చిన నోటీసులకు తాటాకు చప్పులకు భయపడేది లేదని, అలా భయపడితే అప్పటి ఆంధ్ర పాలకులతో ఢిల్లీ పాలకులతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్, హరీష్ రావులు సాధించేవారా అని అన్నారు.

సూట్ కేసులు ఢిల్లీకి మోయడం తప్ప, ప్రజా పాలన గాడి తప్పిందని, ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకతను చూపిస్తున్నార న్నారు. రేవంత్ సర్కార్ నోటీసుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు.  తెలంగాణలో పాలన పడకేసిందన్నారు. తెలంగాణలో పాలన పడకేసిందని మండిపడ్డారు. పాలన వదిలిపెట్టి మిస్ వరల్ సుం దరీమణుల వెనుక మంత్రుల కాన్వాయిలు తిరుగుతున్నాయన్నారు. తెలంగాణ జాతిపిత కెసిఆర్ అని, కెసిఆర్ హరీష్ రావులకు నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు.