calender_icon.png 15 October, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బందీలకు విముక్తి!

14-10-2025 12:00:00 AM

గాజాలో ఎట్టకేలకు శాంతి పవనాలు వీచాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య రెండేళ్లుగా భీకరంగా కొనసాగిన యుద్ధం ముగింపు దిశగా కీలక అడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవతో కుదిరిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక ఒప్పందంలో భాగంగా మొ దటి దశలో ఇరు దేశాలు బందీలకు విముక్తి కల్పించాయి. ఈ నేపథ్యంలో హమాస్ తమ చెరలో ఉన్న 20 మంది బందీలను విడిచిపెట్టింది. వీరిని తీసుకొని రెడ్‌క్రాస్ వాహనశ్రేణి ఇజ్రాయెల్‌కు బయల్దేరింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా తమ వద్ద బందీలుగా ఉన్న 2 వేల మంది పాలస్తీనా ఖై దీలను విడిచిపెట్టేందుకు అంగీకరించింది.  ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గత శుక్రవారమే అమల్లోకి రాగా బందీల విడుదల సోమవారం నుంచి ప్రారంభమైంది.

ఇక రెండో దశలో హమాస్ ఆయుధాలను త్యజించడం.. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్ర ధాన అంశాలుగా ఉన్నాయి. శాంతి ప్రణాళికలో భాగంగా మొదటి దశ విజయవంతం కావడంతో గాజాలో పండుగ వాతావరణం నెలకొంది.  యుద్ధం ఆగిపోవడంతో రక్తపాతానికి తెరపడినట్లయిందని, తమకు మంచి రోజుల వచ్చినట్లేనని భావిస్తున్నారు. మారణహోమం, అణచివేత కారణంగా మానసికంగా, శారీరకంగా అలసిపోయామని, ఇకనైనా ఊపిరి పీ ల్చుకుంటామన్న ఆశ కనిపిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని జెరూస లేం, టెల్ అవీవ్ నగరాల్లోనూ సంబరాలు మొదలయ్యాయి. హమాస్ చె రలో ఉన్న తమ వారి రాకకోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

గ తంలోనూ రెండుసార్లు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒ ప్పందం జరిగింది. 2023 నవంబర్‌లో తొలి ఒప్పందంలో 100 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన హమాస్ ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిగిన రెండో ఒప్పందంలో మరో 25 మంది బందీలు, 8 మంది మృతదేహాలను అప్పగించింది. అయితే మొదటి దశ ఒప్పందంతో గా జాలో పూర్తిగా శాంతి నెలకొందని చెప్పలేం. ఏమాత్రం సందు దొరికినా ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తుందని భావిస్తున్న హమాస్ ఆయుధాలు వీ డేందుకు ఇష్టపడటం లేదు. ఇక హమాస్‌కు చనువిస్తే తమకు రెబల్స్‌గా మారుతారన్న విషయంలో ఇజ్రాయెల్ క్లారిటీతో ఉంది. గాజా తమ పట్టు నుంచి జారిపోకూడదని భావిస్తున్న హమాస్ ఇజ్రాయెల్ సైన్యం గాజాను వీడాలని షరతు విధించారు.

గాజాలోని బఫర్ జోన్లలో తమ సైన్యాన్ని కొనసాగించక తప్పదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. గాజాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అప్పుడే ట్రంప్ సూ చించిన శాంతి ఒప్పందంలో మిగతా దశలు పూర్తయ్యే అవకాశముంటుం ది. రెండేళ్ల కిందట ఇజ్రాయెల్ భూభాగంలోకి అక్రమంగా చొరబడిన హ మాస్ మిలిటెంట్లు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఈ దాడిలో దాదాపు 1200 మంది మరణించగా, 251 మందిని హమాస్ మిలిటెంట్లు తమ బందీలుగా చేసుకుని గాజాకు బలవంతంగా తరలించారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇజ్రాయెల్ హమాస్ అంతమే లక్ష్యంగా జరిపిన యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 67 వేల మంది మరణించగా.. సు మారు 2 లక్షల మంది క్షతగాత్రులయ్యారు. అయితే రెండేళ్ల నుంచి నిత్యం క్షిపణుల మోత, బాంబుల వర్షంతో కంటిమీద కునుకు లేకుండా గడిపిన గాజా ఇకపై గుండె నిండా ఊపిరి పీల్చుకోనుంది.