calender_icon.png 17 October, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైతన్యంతోనే రాజ్యాధికారం

14-10-2025 12:00:00 AM

భారతదేశం ప్రాథమికం గా కుల నిర్మితమైనది. మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి మహోన్నతులు దేశం లో వేల సంవత్సరాలుగా అణిచివేయబడిన వర్గాల చరిత్రను వె లికితీశారు. కడపటి వాడే ఈ దే శాన్ని పాలించిన మొట్టమొదటి మహారాజ్ అని పిలుపునిచ్చా రు. ఊరికి దూరంగా జీవిస్తున్న నేటి మాదిగలే ఒకప్పుడు ఈ దే శాన్ని పాలించారని మరుగున ప డిన చారిత్రక సత్యాన్ని చెప్పారు. ఇంతటి గొప్ప రాజరిక చరిత్ర గ లిగిన మాదిగలు వారసత్వ జ్ఞా నాన్ని మరిచిపోయి ఆత్మనూన్యతభావంతో జీవిస్తున్నారు.

వీటి పై పూలే, అంబేద్కర్, కాన్షీరాం లాంటి మేధావులు తమ పోరాటం బహిర్గతం చేసి సాంస్కృతిక చైతన్యంతో మాదిగలను పునరుజ్జీవింపజేశారు. చరిత్రలో అంబేద్కర్, కాన్షిరాం మొదట ఒక కులంతోనే వెళ్లి గొప్ప విజయాలు సాధించి చూపెట్టారు. తెలంగాణ రాష్ర్టంలో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహరాజ్ సైతం మాదిగలనే మొదట చై తన్యం చేశాడు. మాదిగలు మహారాజులని గుర్తు చేయడానికి 5 వేల కిలోమీటర్ల మహాకాలి నడక యాత్రను ఆరు నెలల పాటు కొనసాగించారు. ఇది 2017 అక్టోబర్ 14న వనపర్తి నుంచి ప్రారంభించారు. నేటితో ఈ ‘మహా కాలినడక’ పాదయాత్రకు 8 ఏళ్లు పూర్తయ్యాయి. విశారదన్ మహా కాలినడకలో మాదిగలను చరిత్ర, సాంస్కృతిక వారసత్వ జ్ఞానంతో చైతన్యం చేశాడు.

ఒక చేతిలో భారత రాజ్యాంగం, మరో చేతిలో అశోక రాజచిహ్నం చేతబూని మహారాజు వేషధారణతో తెలంగాణ ప్రాంతంలోని ల క్షలాది మాదిగల్లో  విప్లవాన్ని సృష్టించారు. వారి నామ, రూప, గుణాల ను  మారుస్తూ ఆత్మనూన్యత భావాన్ని తొలగించారు. గ్రామ గ్రామాన మాదిగ గూడాల్లో మహారాజుల కాలనీ బోర్డులు ఏర్పాటు చేయించారు. ప్రపంచ చరిత్రలోని ఒక జాతి ఉన్నతీకరణ కోసం సాగిన మహాయాత్ర ఇది. స్వధర్మంతో సాగిన ఈ మహా కాలినడక వరంగల్ లోని 2018 ఏ ప్రిల్ 14న అశేష జనవాహినితో నిర్వహించిన భారీ బహిరంగ సభతో ముగిసింది. అక్కడ మాదిగలకు నామకరణ పట్టాభిషేకం చేశారు.

మహా కాలినడక అనంతరం డాక్టర్ విశారదన్ మహారాజ్ బీసీ, ఎస్సీ, ఎస్టీలను కలుపుకొని పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర పేరుతో రాజకీయ చైతన్య యాత్ర చేశారు. ఇప్పుడు 90 శాతం బీసీ,ఎస్సీ, ఎస్టీల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల రథయాత్ర తెలంగాణ వ్యాప్తంగా సింహ గర్జన చేస్తున్నది. మూడున్నర కోట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు కష్టాలు, కన్నీళ్లు, బాధలు పరిష్కారం దిశగా ఉద్యమం ముందుకెళ్తుంది. పీడిత వర్గాల విముక్తికై విశారదన్ మహాకాలినడక నుంచి నేటి లక్ష కిలోమీటర్ల రథయాత్ర వరకు అంబేద్కర్, కాన్షీరాంల ఫార్ములనే అనుసరించారు. భారతీయ మనువాద సమాజంలో ముక్కలు చెక్కలైన బీసీ, ఎ స్సీ, ఎస్టీ వంటి కులాలు ఏకం కావాలంటే మొదట ఆయా కులాలు ఒకటి కావాల్సిందే. చైతన్యంతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. అప్పుడే నిజమైన విముక్తి లభించినట్లవుతుంది.

సంపతి రమేష్ మహారాజ్