calender_icon.png 23 November, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిగిన ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లు పెంచాలి

10-02-2025 12:25:16 AM

హుజూర్ నగర్, ఫిబ్రవరి 9: ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా హమాలి రేట్లు పెంచాలని  ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ కోరారు. హుజూర్ నగర్ పట్టణ పరిదిలోని రైస్ మిల్లు హమాలీలు రేట్లుకు గతంలో చేసుకున్న ఒప్పంద కాల పరిమితి ముగియడంతో నూతన ఒప్పందంకొరకు పట్టణ లోకల్ రైస్ మిల్లర్స్ యజమాన్యం,రైస్ మర్చంట్ హమాలీ మేస్త్రుల యూనియన్ నాయకులతో కలిసి ఆదివారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  చర్చల్లో ఇరు వర్గాలు ఏకబిప్రాయా నికి రాకపోవడంతో వాయిదా వేశామని , పెరిగిన ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తినేని వెంకటేశ్వరరావు, పునుగుపాటి వెంకటేశ్వర రావు,చిన్నం సురేష్,భోగాల శ్రీనివాస్ రెడ్డి,నోముల సీతా రామయ్య,విశ్వనాథం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.