calender_icon.png 23 November, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలి

10-02-2025 12:22:35 AM

పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రఘునందన్

నల్లగొండ, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : వినియోగదారులకు ఇబ్బంది లేకుండా పెట్రోల్ బంకుల నిర్వాహకులు టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలని  వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ ఆదేశించారు.

ఆదివారం చింతపల్లి మండలంలోని పెట్రోల్ బంకులను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. పలు పెట్రోల్ బంకుల్లో మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. టాయిలెట్స్ నిర్వహణ సక్రమంగా లేకుంటే చమురు సంస్థలు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. బంకుల్లో ఎట్టి పరిస్థితుల్లో నోస్టాక్ బోర్డు పెట్టొద్దని యాజమాన్యాలకు ఆయన సూచించారు. నిల్వలు నిండుకోక ముందే స్టాక్ తెప్పించాలని చెప్పారు.