calender_icon.png 8 August, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టు పనుల వేగానికి టాస్క్‌ఫోర్స్ కమిటీ

08-08-2025 12:11:51 AM

  1. రీజినల్‌రింగ్ రోడ్డు తెలంగాణకు మణిహారం
  2. రూ. 6 వేల కోట్లతో హామ్ రోడ్ల రిపేరు 
  3. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాం తి): ఎన్‌హెచ్‌ఏఐ, ఎంవోఆర్‌టీహెచ్ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్రంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సరైన ప్రణాళికల తో ముందుకెళ్లేందుకు, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షించేం దుకు ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీ పనిచేస్తుందన్నారు.

గురువా రం సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగిం ది. విద్యుత్‌లైన్, షిఫ్టింగ్, వాటర్ యుటిలిటీ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ తదితర అంశాలపై చర్చించారు. వరంగల్ ఖమ్మం సెక్షన్‌లో ఎన్‌హెచ్ 163జీ ప రిధిలోని ఫ్యాకేజీ చెరువుల అంశాన్ని మ ం త్రికి అధికారులు వివరించారు. మహబూబాబా ద్, నెల్లికుదురు ప్రాంతాల్లో చెరువుల సమస్యలు, హైలెవల్ బ్రిడ్జి ప్రపోజల్స్, ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్‌ఓసీ రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఎన్‌హెచ్ సీతారా మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రా జెక్టు రోడ్డుతో పాటు గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు సమస్యలను మంత్రికి వివరిం చగా, ఇరిగేషన్ అ ంశాలు ఏమైనా ఉంటే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు. ఎ న్‌హెచ్ ప్రాజెక్టులు 12 ఉంటే అందు లో 6 ప్రాజెక్టుల ఫారెస్ట్ క్లియరెన్స్‌కు కోసం వెంట నే చర్యలు చేపట్టాలని, కల్వకుర్తి శ్రీశైలం 62 కి.మీ ఎలివేటె డ్ కారిడార్‌కు కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూల ంగా ఉన్నారని తెలిపారు.

ఫారెస్టు అధికారులు సమన్వయంతో పనిచేస్తే గొప్ప ప్రాజెక్టు పూర్తి అ వుతందన్నారు. విద్యుత్ సమస్యలుంటే వాటిని వె ంటనే పరిష్కరించాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ము షారఫ్ అలీకి సూచించారు. మైనింగ్ శాఖ నుంచి రావాల్సిన అనుమతులు వెంటనే క్లియర్ అయ్యే విధంగా చూడాలని సంబంధిత అధికారి శ్రీధర్‌కు మంత్రి సూచించారు.

భూసేకరణలో సమస్యలను వెంట వెంటనే పరిష్కరిం చాలని సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్‌కుమార్‌కు సూచించారు. కొన్ని  చోట్ల సున్నితమైన అంశాలుంటాయని, వాటి ప ట్ల మానవతా దృక్పథంతో అధికారులు మెదలాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే టాస్క్‌ఫోర్స్ బాగా పని చేసినట్లువుతందని, ఆ దిశగా అధికారులు పని చేయాలన్నారు.

తెలంగాణకు మణిహారం ట్రిపుల్ ఆర్

రిజినల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్‌ఆర్) తెలంగాణకు మణిహారమని, రెండు, మూడు నెలల్లో పనులు ప్రారంభించాలని నిర్ణయంతో ఉన్నామన్నారు. ఉ త్తర భాగం భూసేకరణ దాదాపు పూర్తయిందని, 6 లేన్లుగా అప్‌గ్రేడ్ చేయడం వల్ల పనులు అలస్యమయ్యాయని తెలిపారు. సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, భువనగిరి జిల్లాలో అక్కడక్కడున్న చిన్న, చిన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూ చించారు.

తనకు రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్దే ముఖ్యమని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టుల క్లియరెన్స్‌కోసం త్వరలో ప్రధాని మోడీని కలుస్తామన్నారు. సమీక్షలో స్పెషల్ సీఎస్ వికాస్‌రాజు, ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీధర్, సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారప్‌అలీ  తదితరు లు పాల్గొన్నారు. 

6 వేల కోట్లతో హామ్ రోడ్ల రిపేరు

 వచ్చే వారం హామ్ రోడ్ల టెండర్లు పిలుస్తున్నామని, తొలిదశ రూ. 6 వేల కోట్ల మూడేండ్లలో రి పేర్లు పూర్తి చేస్తామని మంత్రి వెంకట్‌రెడ్డి అన్నా రు. ఈ నెల 12న హామ్ రోడ్ల అంశంపై కాంట్రాక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నా రు. గురువారం సచివాలయంలో మీడియాతో మంత్రి వెంకట్‌రెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు. ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్‌కు ఈ నెలలో కేంద్ర కేబినెట్‌లో ఆమో దం తెలుపుతామని గడ్కరీ హామీ ఇ చ్చినట్టు స్పష్టం చేశారు.

ఢిల్లీ ధర్నా విజయవ ంతం అయిందని, రాంచీలో ఉండటం వల్ల రా హుల్‌గాంధీ రాలేదన్నారు. 10 ఏళ్ల అవినీతిపై క మిషన్‌లతో విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు. 20 నెలలకే కేటీఆర్ డైరీలో పేర్లు రా సుకుంటామంటున్నారని, మరి పదేళ్లలో తమ కా ర్యకర్తలు ఎంతో ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశా రు. తాము రాయాలంటే ఎన్నో డైరీలు రాసుకోవాలన్నారు. కలెక్టర్‌లను, ఎస్పీలను కూడా కేటీఆర్ తిడుతు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధు లు ప్రస్తావించగా మంత్రి వెంకట్‌రెడ్డి మౌనంగా ఉన్నారు. జగదీశ్‌రెడ్డి గురుంచి మాట్లాడే స్థాయి తనది కాదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్గొండ అభివృద్ధి తన లక్ష్యమని, నల్గొండ రింగ్ రోడ్ టె ండర్స్ పిలిచామని స్పష్టం చేశారు. శుక్రవారం సి నీ కార్మికుల సమ్మెపై చర్చలకు పిలిచామని, ఇప్పటికే దిల్ రాజుతో మాట్లాడినట్టు తెలిపారు.