calender_icon.png 6 August, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల కోసం నిధులను మంజూరు చేయండి

06-08-2025 01:11:33 AM

జగిత్యాల అర్బన్, ఆగస్టు 5(విజయ క్రాంతి): గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరై మధ్యలో నిలిచిపోయిన 1611 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు రూ.52 కోట్లు నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ మేరకు జీవన్ రెడ్డి వినతిపత్రం సమర్పించగా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలకు 2008లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కావలసిన స్థలాన్ని సేకరించి 4,000 మందికి ఇల్లు మంజూరు చేయగా, అందులో రెండు వేల ఇళ్లను తొలగించి గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టిందన్నారు.