19-05-2025 01:00:21 AM
మైథలాజికల్ కథతో మాస్టర్ మహేంద్రన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘వసుదేవ సుతం’. వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత సారథ్యం వహిస్తున్న మణిశర్మ చేతుల మీదుగా టీమ్ తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేయించింది. ఈ వీడియో చూస్తే.. గుడిలోని నిధి చుట్టూ ఈ కథ తిరుగుతుందనిపిస్తోంది.
ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు. అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేశ్‌చంద్ర మీనన్, ఐశ్వర్యలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, భద్రమ్, జబర్దస్త్ రామ్‌ప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్ తదితరులు పలు పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు డీవోపీ: జిజ్జు సన్నీ; పాటలు: చైతన్యప్రసాద్, శ్రీహర్ష ఈమని; ఫైట్స్: బింబిసార రామకృష్ణ.