calender_icon.png 19 July, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాపాయ స్థితి నుంచి.. పరీక్షహాల్‌కు

19-07-2025 01:45:34 AM

- 17 ఏండ్ల యువతికి పునర్జన్మను ప్రసాదించిన ఉస్మానియా డాక్టర్లు

- జ్వరంతో 5 రోజుల్లోనే లివర్ ఫెయిలై ప్రాణాపాయ స్థితి

- సూపర్ అర్జెంట్ క్యాటగిరీలో లివర్ కేటాయించిన జీవన్‌దాన్

- 24 గంటల్లోనే ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన ఉస్మానియా వైద్యులు

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి):  రెండు నెలల కింద ప్రాణాపాయ స్థితిలో కోమాలో ఉన్న ఓ యువతి.. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హాజరవుతోంది. జ్వరంతో కేవలం 5 రోజుల్లోనే లివర్ ఫెయిలై ఉస్మానియాలో చేరిన యువతికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. జూబ్లీహిల్స్‌లో తల్లితో పాటు నివాసముంటున్న బ్లెస్సీ గౌడ్ ఈ ఏడాది మే నెలలో జ్వరం బారిన పడింది.

చికిత్స కోసం తల్లి కావ్య ఆమెను ప్రైవేటు హాస్పిటల్‌లో అడ్మిట్ చేయించింది. 5 రోజుల తర్వాత ఆ యువతి కోమాలోకి వెళ్లింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను మే 12వ తేదీన కుటుంబ సభ్యులు ఉస్మానియా హాస్పిటల్‌లో చేర్పించారు. బ్లెస్సీని పరీక్షించిన ఉస్మానియా వైద్యులు... ఆమె లివర్ పూర్తిగా పాడైపోయిందని గుర్తించారు. అన్ని ఆధారాలతో లివర్ కోసం జీవన్‌దాన్ సూపర్ అర్జంట్ క్యాటగిరీలో డోనర్ కోసం రిజిస్టర్ చేశారు. జీవన్‌దాన్ సూపర్ అర్జంట్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎక్స్‌పర్ట్ టీమ్ ఈ రిక్వెస్ట్‌ను పరిశీలించి లివర్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది.

అదే సమయంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో బ్లెస్సీ బ్లడ్ గ్రూప్‌నకు మ్యాచ్ అయ్యే వ్యక్తి బ్రెయిన్ డెత్ అయ్యాడు. ఆ వ్యక్తి లివర్‌ను బ్లెస్సీ కోసం జీవన్‌దాన్ కేటాయించింది. మే 14వ తేదీన ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసింది. రెండు వారాల తర్వాత బ్లెస్సీని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుని ఫస్ట్ ఇయర్ బీటెక్ ఎగ్జామ్స్‌కు హాజరవుతోంది.

సర్కారీ వైద్యంలో దేశంలోనే తొలిసారి

ప్రాణాపాయ స్థితిలో ఉన్న బ్లెస్సీ ప్రస్తుతం బీటెక్ పరీక్షలకు హాజరవుతుండడం పట్ల ఉస్మానియా వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ మధుసూధన్ శుక్రవారం ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో ట్రా న్స్‌ప్లాంటేషన్ జరగడం ఇదే తొలిసారి. ఉ స్మానియా వైద్యులు, జీవన్‌దాన్ టీమ్ వే గంగా స్పందించడంతో బ్లెస్సీకి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినట్టు వివరించారు. ఇందుకు స హకరించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృ తజ్ఞతలు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉ న్న బ్లెస్సీకి పు నర్జన్మను ప్రసాదించిన డాక్టర్ల బృందాన్ని మ ంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.

సూపర్ అర్జెంట్ కేటగిరీ అంటే.. 

అకస్మాత్తుగా కాలేయం పూర్తిగా వైఫల్యం చెంది.. 48 గంటల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న వారికి జీవన్‌దాన్ సూపర్ అ ర్జె ంట్ క్యాటగిరీ కింద ప్రాధాన్యమిస్తుంది. నిపుణుల కమిటీ ఆమోదం తర్వాత బ్రెయిన్ డెత్ పర్సన్ నుంచి కాలేయం కేటాయిస్తారు.