calender_icon.png 19 July, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రముఖ హాస్యనటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

19-07-2025 01:43:28 AM

సినిమా ప్రతినిధి, జూలై 18 (విజయక్రాంతి): ప్రముఖ కామెడీ విలన్, హాస్యనటుడు ఫిష్ వెంకట్ (53) కన్నుమూశారు. రెండు కిడ్నీల వైఫల్యంతో గత తొమ్మిది నెలలుగా బాధ పడుతు న్న ఫిష్ వెంకట్‌కు కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించారని ఆయన భార్య సువర్ణ, కుమార్తె  ఇటీవల మీడియా ద్వారా వెల్లడించా రు. ఆపరేషన్‌కు సుమారు రూ.50 లక్షల ఖర్చు అవుతుందని, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తమ ను ఆదుకోవాలని కోరారు.

డయాలసిస్ చే యించుకుంటూ చికిత్స పొందుతున్న ఫిష్ వెంక ట్ పరిస్థితి ఇటీవల విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలో పుట్టిపెరిగిన ఫిష్ వెం కట్ అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్.

ముషీరాబాద్ చే పల మార్కెట్‌లో చేప ల వ్యాపారిగా ఉపాధి పొందుతూ ఫిష్ వెంకట్ గా అందరికీ సుపరిచితుడయ్యారు. రామ్‌నగర్ లో నివాసం ఉండే ఫిష్ వెంకట్‌ను దర్శకుడు వీవీ వినాయక్ సినిమాల్లోకి పరిచయం చేశారు. పవన్ కల్యాణ్ ‘ఖుషి’తో సినీరంగంలోకి వచ్చా రు. తనదైన ప్రత్యేక శైలితో హైదరాబాదీ యాలో డైలాగులు చెప్తూ ఆకట్టుకున్నారు. కామెడియన్‌గా, విలన్ గానే కాక కామెడీ విలన్ పాత్రల్లో అలరించారు.