24-08-2025 01:42:08 AM
ప్రారంభించిన అధికారులు
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి ): రాష్ర్టంలోని 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) అటెండెన్స్‌ను విద్యాశాఖ కార్య దర్శి యోగితా రాణా, ఇంటర్మీడియెట్ విదా ్య సంచాలకులు కృష్ణ ఆదిత్య శనివారం ప్రారంభించారు. మొత్తం 1,64,621 మంది విద్యార్థులలో ఇప్పటివరకు 63,587 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, సోమవారం నాటికి మిగిలిన వారు కూడా నమోదు చేసుకుంటారని తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా పారదర్శకత, విద్యా ప్రమా ణాలను మెరుగుపరుచుకోవచ్చన్నారు. ఏఐ సాంకేతికను ఉపయోగించి కేవలం 10 సెకన్లలో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందన్నారు.