24-08-2025 01:44:04 AM
-సీపీఎస్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్
- జీవో ప్రతులను దగ్ధం చేసిన ఉద్యోగులు
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి) : పాత పెన్షన్ స్కీం(ఓపీఎస్) విధానానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.28ను రద్దు చేయాలని తెలంగాణ రాష్ర్ట కాంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం (సీపీఎస్) ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరుతూ రాష్ర్ట వ్యాప్తంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టారు.
ఈ సంద ర్భంగా యూనియన్ రాష్ర్ట అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేస్తే రాష్ట్రానికి నయా పైసా ఆర్థిక భారం ఉండదన్నారు. ఉద్యోగుల నుంచి వచ్చిన కాం ట్రిబ్యూషన్ సుమారు 4.6 లక్షల కోట్లు రూపాయలను స్టాక్ మార్కెట్‌లోకి మళ్లించడం తప్ప ఉద్యోగ సంక్షేమం, సామాజిక భద్రత గురించి ఏనాడూ కేంద్రం ఆలోచించలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్ని కల మ్యానిఫెస్టోలో సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఈ మేరకు రాష్ర్ట సీపీఎస్ నోడల్ ఆఫీస్ కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసనలు తెలిపి, అనంతరం జీవో నెం.28 ప్రతు లను దగ్ధం చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కల్వాల్ శ్రీకాంత్, నరేశ్ గౌడ్, నరేంద్రరావు, శ్యామసుందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.