24-08-2025 01:39:48 AM
-ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి ): రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఆదివారం, సోమవారం, మంగళ వారం ఉరుములు, మెరుపులతోపాటు, గంటకు 30 కి.మీ.వేగంతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రభీం ఆసిఫాబాద్, మంచి ర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూ డెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. సోమవారం జయ శంకర్ భూపలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వర్షం పడుతుందని పే ర్కొంది.