calender_icon.png 24 August, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నా

24-08-2025 01:45:28 AM

-నియోజకవర్గ అభివృద్ధికే సీఎంను కలిశా

-గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 

గద్వాల, ఆగస్టు 23(విజయక్రాంతి): గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తా ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశానని, నేను ఇంకా బీఆర్‌ఎస్‌లో ఉన్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు అసెంబ్లీ స్పీకర్ వారికి నోటీసులు ఇచ్చారు. 

  అందులో భాగంగా తన కు సైతం నోటీసులు  పంపారని అయితే నేను ఇంకా తీసుకోలేదని మా పీఏ వద్ద ఉం దని ఎమ్మెల్యే తెలిపారు.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను స్పీకర్‌కి వివరణ ఇస్తా మని  నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే  సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందే త ప్ప నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఎమ్మె ల్యే కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు.