calender_icon.png 24 August, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ సీఎం చంద్రబాబు చాలా రిచ్!

24-08-2025 01:00:04 AM

ఆస్తి 931 కోట్లు

- 332 కోట్లతో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమాఖండు రెండో స్థానంలో.. 

- 30 కోట్లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏడో స్థానంలో.. 

- పశ్చిమబెంగాల్ సీఎం ఆస్తి కేవలం 15 లక్షలే

- దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల ఆస్తులు వెల్లడించిన ఏడీఆర్

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఆంధ్రప్రదేశ్ ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 931 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. దేశంలోని 27 రాష్ట్రాలు, విధానసభలు ఉన్న మూడు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డె మోక్రటిక్ రిఫామ్స్ నివేదిక (ఏడీఆర్) వెల్లడించింది. ఈ జాబితాలో ఏపీ సీఎం చం ద్రబాబు మొదటి స్థానంలో నిలిచారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాం గ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రూ.15 లక్షల ఆస్తులతో 30వ స్థానంలో ఉన్నారు. అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు రూ.332 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో, రూ.51 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మూడో స్థానంలో, రూ.46 కోట్ల ఆస్తులతో నాగాలాండ్ సీఎం నైపు రియో నాలుగో స్థానంలో, రూ.42 కోట్ల ఆస్తులతో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఐదో స్థానంలో, రూ.38 కోట్ల ఆస్తులతో పాండిచ్చేరి సీఎం రంగస్వామి ఆరో స్థానంలో, రూ.30 కోట్ల ఆస్తులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడో స్థానంలో ఉన్నా రు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ 30వ స్థానంలో నిలిచారు. బెనర్జీ ఆస్తి కేవలం రూ.15 లక్షలే. దేశంలోని 30 మంది సీఎంల ఆస్తుల విలువ రూ. 1630 కోట్లుగా ఉందని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఏడీఆర్ ఈ జాబి తాను రూపొందించింది.

30 మంది ముఖ్యమంత్రుల్లో కేవలం ఇద్దరు మాత్రమే మహి ళా సీఎంలు ఉన్నారు. 10 శాతం మంది ము ఖ్యమంత్రుల వద్ద రూ.50 కోట్లు అంతకం టే ఎక్కువ ఆస్తులు, 30 శాతం మంది వద్ద రూ.11 నుంచి 49 కోట్ల ఆస్తులు, 53 శాతం మంది వద్ద రూ.1 నుంచి 10 కోట్ల ఆస్తులు, 7 శాతం ముఖ్యమంత్రుల వద్ద కోటి రూపాయల కంటే తక్కువ ఆస్తులున్నాయి.