calender_icon.png 24 August, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ షాప్ ముందు నడి రోడ్డుపై నిలుపుతున్న వాహనాలు

24-08-2025 12:33:56 AM

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మంలో మందు త్రాగిన మందు బాబులకు, మద్యం షాపులు నడిపే వైన్, బార్ షాపులకు నియమాలు వర్తించవా లేక ఖమ్మం లో వారికీ ఏమైనా ప్రత్యేక అనుమతులు ఉన్నాయా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మందు బాబులకు, బార్, వైన్ షాపుల యజమానులకు ట్రాఫిక్ తో కానీ, సమాజం తో కానీ సంబంధం లేదు, వారికి ఏదో ప్రత్యేకమైన అనుమతులు ఉన్నట్టు వారి వైఖరి ఉంది. శనివారం రాత్రి 10:30 సమయంలో ఖమ్మం శ్రీ శ్రీ సర్కిల్లోని ఒక బార్ షాపు వద్ద ఒక కారు వచ్చి గొల్లగూడెం రోడ్డు కి వెళ్లే రహదారిపై అడ్డంగా నిలిపారు. కారులోని ఒకరు బార్ షాప్ లోకి మద్యం తెచ్చుకునేందుకు వెళ్లారు. డ్రైవింగ్ చేసే వ్యక్తి కారులోనే ఉన్నారు, కానీ ఆయన ఫుల్లుగా మద్యం సేవించి వున్నారు. కారు డెక్కు ఫుల్లుగా  సౌండు పెట్టుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుని కొద్దిసేపు చిందులు వేశారు ఆ తరువాత నడిరోడ్డు మీదకి వచ్చి ఇంకొద్దిసేపు చిందులు వేశారు. వారి వాహనం గొల్లగూడెం రోడ్డుకి వెళ్లే రహదారికి మధ్యలో అడ్డంగా నిలిపారు. ఆ సమయంలో గొల్లగూడెం రోడ్డు కి వెళ్లే  వారు వచ్చి హారన్ లు కొట్టిన ఆ కారు యజమాని మాత్రం అక్కడే ఉండి చిందులేస్తున్నారు తప్పించి వాహనాన్ని పక్కన తీయలేదు. బార్ షాపుకు సంబంధించిన సెక్యూరిటీ గార్డు కారు యజమానిని పక్కకి తీయవలసిందిగా కోరారు కానీ ఆ కార్ యజమాని మాత్రం ఆ సెక్యూరిటీ గార్డ్ ని ఏమాత్రం పట్టించుకోలేదు. గొల్లగూడెం రోడ్డు వెళ్ళవలసిన వారు హారన్ సౌండ్ చేసినా ఆ కార్ యజమాని కారు ప్రక్కకు తీయలేదు. దీంతో ఎందుకు వారితో గొడవ అనుకున్నారు ఏమో కానీ  వారే పక్క నుంచి ఇబ్బంది పడుతూ వెళ్లిపోయారు. మరి కొందరు వేరే మార్గం ఎంచుకున్నారు. మందు బాబు మాత్రం కారును కొద్దిగా కూడా కార్ ని పక్కకి తీయలేదు. 

ఇదంతా గమనిస్తున్న ఖమ్మంలోని కొందరు ఏమంటున్నారంటే బార్, వైన్ షాపులు ఉన్న వారికీ, ఖమ్మంలో మద్యం సేవించిన వారికి ఏమన్నా ప్రత్యేక అనుమతులు ఉన్నాయా వీరిని పోలీసు వారు కానీ అటు ఎక్సైజ్ వారు కానీ ఏమీ అనరా అని అడుగుతున్నారు. పోలీసు వారు ఎక్సైజ్ వారు కలగజేసుకొని ఇటువంటి విపరీత ధోరణి ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకొని స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.