calender_icon.png 22 November, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులివ్వాలి

22-11-2025 12:20:01 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు

 టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు వినతి

రేగొండ/భూపాలపల్లి, నవంబర్ 21 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్, కార్యదర్శి గుజ్జ సారేశ్వరరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీడబ్ల్యూజేఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా సతీష్ కుమార్, సారేశ్వరరావు మాట్లాడుతూ జర్నలిస్టులకు పెండింగ్ లో ఉన్న ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్లు, మహిళా జర్నలిస్టులకు రాత్రి పూట రవాణా సౌకర్యం తదితర సమస్యలపై ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ వినతిపత్రాలు, దరఖాస్తులు ఇస్తూ ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్ల దృష్టికి తెస్తుందన్నారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉన్నారనీ, ఇందులో కేవలం 274 మందికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు ఉన్నాయన్నారు.

అక్రిడిటేషన్లు గత ఏడాదిన్నర కాలంగా స్టిక్కర్లతో నడుస్తున్నాయనీ,పర్మినెంట్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో విధుల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలు వెంటనే ఏర్పాటు చేసి వర్కింగ్ జర్నలిస్టులందరికీ కొత్త కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గతంలో 37 మందికి ఇంటి స్థలాల పట్టాలి ఇచ్చారని, వీరితోపాటు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇం డ్లు మంజూరు చేయాలన్నారు. రేగొండ మండల కేంద్రానికి చెందిన 12 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చారని, వీరికి కూడా స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు.

అదే విధంగా టేకుమట్ల మండలంలోని జర్నలిస్టులకు సైతం పట్టాలు ఇచ్చారని, స్థలం కేటాయింపులో జాప్యం జరుగుతుందన్నారు. అంతేకాకుండా జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు కొలుగూరి సంజీవరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చింతల కుమార్ యాదవ్, గాదె రమేష్, రోంటాల శంకర్, ము లకల లక్ష్మారెడ్డి, మండల రాంబాబు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

సరస్వతి అంత్యపుష్కరాలు దిగ్విజయంగా నిర్వహించాలి 

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 

కాళేశ్వరం, నవంబర్ 21 (విజయక్రాంతి): సరస్వతి నది అంత్యపుష్కరాలు దిగ్విజయంగా నిర్వహించడానికి ప్రణాళిక బద్ధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం కాలేశ్వరంలోని ఈ ఓ కార్యాలయంలో సరస్వతి అంత్యపుష్కరాలు, కాళేశ్వరం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తదితర అంశాలపై రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, ఆర్ అండ్ బీ, పంచాయతి, పంచాయతి రాజ్, విద్యుత్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారిగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం 2026 మే 21 నుండి జూన్ 1వ తేదీ వరకు కాలేశ్వరంలో జరగనున్న సరస్వతి అంత్యపుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ముందుగానే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, శాఖల వారిగా చేపట్టాల్సిన పనులపై స్పష్టమైన ప్రణాళికలు, అంచనా నివేదికలు, మార్పులు, చేర్పుల వివరాలను తయారు చేసి త్వరితగతిన సమర్పించాలని సూచించారు. ఈ సంవత్సరం మే 15 నుండి 26 వ తేదీ వరకు జరిగిన సరస్వతి పుష్కరాలను వైభవంగా నిర్వహించామని, అదే తరహాలోనే సరస్వతి అంత్య పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కాళేశ్వరంలో శాశ్వత హెలిపాడ్ నిర్మాణం చేపట్టాలని స్పష్టంచేశారు.

పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సరస్వతి ఘాట్ ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కళ్యాణ కట్ట భవనం నిర్మాణంలో జాప్యం జరుగుతోందని త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే సరస్వతి మాత విగ్రహం పైన పైకప్పు, ప్లాట్ ఫామ్ పనులను డిసెంబర్ వరకు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, కాటారం డిఎస్పీ సూర్యనారాయణ, దేవాలయ ఈఓ మహేష్, ఆర్ అండ్ బి ఈ ఈ రమేష్, పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు, విద్యుత్తుశాఖ డీఈ పాపిరెడ్డి, డివిజనల్ పంచాయతి అధికారి మల్లికార్జున్ రెడ్డి, తహసీల్దార్ రామారావు, ఇరిగేషన్ డీఈ ప్రకాష్, దేవాదాయ శాఖ ఏఈ అశోక్ కుమార్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.