calender_icon.png 26 May, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తా

26-05-2025 01:44:44 AM

 కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లివెంకట రమణారెడ్డి 

రాజంపేట మే 25 (విజయ క్రాంతి): కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

ఆదివారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని తలమడ్ల గ్రామంలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి నియోజకవర్గంలోని నిర్మించిన కళ్యాణ  మండపాలకు రేకులు షెడ్ ల నిర్మాణం కోసం  రాజంపేట మండలం తలమడ్ల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన జై భవాని రూపింగ్ ఇండస్ట్రీస్ ను పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రేకుల తయారీ పరిశ్రమ కామారెడ్డి నియోజకవర్గంలో అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు, గతంలో కుల సంఘాలకు ఇచ్చిన హామీ ప్రకారం సాధ్యమైనంత తొందరగా కళ్యాణ మండపాలతో పాటు  కుల సంఘాలకు హామీ ఇచ్చిన ప్రతి ఒక్క నిర్మాణ ప్రక్రియ తొందరగా పూర్తి  చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

అనంతరం ఫ్యాక్టరీలో తిరిగి రేకుల తయారీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో రాజంపేట బిజెపి మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి, జై భవాని రూపింగ్ ఇండస్ట్రీ ఓనర్ ఏవీఎస్ రాజు, జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.