calender_icon.png 25 November, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం

25-11-2025 12:40:19 AM

- రూ.12 కోట్లతో 150 అడుగుల రాజగోపురం !

- రాజగోపురం పుట్టింగ్ పనుల ప్రారంభోత్సవం

- పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల, నవంబర్ 24 : రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామ ని, రూ.12 కోట్లతో 150 అడుగుల రాజగోపురం నిర్మిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆలయ ఆవరణలో నిర్మిస్తున్న రాజగోపురం పుట్టింగ్ పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం వేలాది మంది దర్శించుకునే బొంతప ల్లి వీరభద్రస్వామి దేవాలయం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. భ క్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులు, దాతల సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే అతిపెద్ద రాజగోపురాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మ రిన్ని అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వై స్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, పాలక మండలి చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, ఈవో శశిధర్ గుప్తా, షేక్ హుస్సేన్, సీనియర్ నాగేందర్ గౌడ్, లక్ష్మీనారాయణ, పాల్గొన్నారు.