25-11-2025 12:38:17 AM
తోలుబండ ప్రాంతవాసులు తాగు నీటి పై ఎమ్మెల్యేకు వినతి
వేణు వెంటనే రంగంలోకి ఆర్డబ్ల్యూఎస్ అధికా
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన తోలుబండ వాసులు
చిన్నచింతకుంట, నవంబర్ 24: ప్రజా ప్రతినిధులకు ఓ సమస్య ఉంది అని ప్రజలు దృష్టికి తీసుకుపోతే ఆ సమస్య పరిష్కార రూపం దాల్చేందుకు ఎంత సమయం పడుతుందో అసలు ఆ సమస్య పరిష్కారం మార్గం వైపు అడుగులు వేస్తుందో లేదో తెలియని పరిస్థితులు ఎన్నో చూసిఉంటాం. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి నూతన విధానాలకు శ్రీకారం చుట్టు ప్రజలు కోరిన వెంటనే సమస్యలకు పరిష్కార రూపం దాల్చినందుకు అడుగులు వేస్తూ ప్రజల మండల పొందుతున్నారని ఆ ప్రాంత ప్రజలే చెబుతున్న మాట.
మిషన్ భగీరథ అందుబాటులో ఉన్నప్పటికీ తాగునీటి సమస్య ఉంది అని సిసి కుంట మండల పరిధిలోని తోలుబండ ప్రాంతవాసులు ఎమ్మెల్యేకి సోమవారం వినతి పత్రాన్ని సమర్పించి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే అప్పటికప్పుడు ఆ సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారికి ఫోన్ చేసి తోలుబండ ప్రాంత వాసులకు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.
గంటల వ్యవధిలోని తోలుబండ ప్రాంత వాసులకు తాగునీటి సమస్య శాశ్వతంగా లేకుండా ఉండేందుకు అవసరమైన అడుగులు పడ్డాయి. ఇంత వేగంగా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించేం దుకు సంకల్పించడంతో జరిగిన ఘటన నియోజకవర్గం అంతా తీవ్ర చర్చకు దారితీస్తుంది.
పైపులైన్ కు ప్రత్యేక ఎస్టిమేషన్..
తోలుబండ ప్రాంతంలో నీటి ఎద్దడి గల నివాస ప్రాంతాలకు ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు ఎస్టిమేషన్ వేసి వెంటనే పనులు జరిగేలా చూస్తామని సంబంధిత అధికారి చెప్పడం గమనార్హం.
దీంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయిన వెంటనే దేవరకద్ర నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎస్ వెంకటేష్ నేతృత్వంలో నీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు సంఘటన స్థలానికి సంబంధిత అధికారులు వచ్చి విచారణ చేసి పరిష్కార రూపం దాల్చుతామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని ఆ ప్రాంతవాసులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుండ్రు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే సేవ చేయడం అంటే ఈ పనులకు ఒక నిదర్శనమని పలువురు చర్చించుకుండ్రు.