calender_icon.png 22 November, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

10-02-2025 12:00:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 

పటాన్‌చెరు, ఫిబ్రవరి 9 : ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అంది స్తున్నామని  ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.  పటాన్చెరు డివిజన్ పరిధి లోని చైతన్యనగర్ మహదేవుని ఆలయంలో వంటశాల షెడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆలయంలో పట్టణ, స్థానిక నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ  నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అంది స్తున్నామని అన్నారు.

మహదేవుని దయతో నియోజక వర్గ ప్రజలందరూ ఆయురా రోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, ప్రతాప్ గౌడ్, కొమరగూడెం వెంకటేష్, మల్లేష్ యాదవ్, శ్రీరాములు, శంకర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.