calender_icon.png 22 November, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షలంటే ఆందోళన వద్దు

09-02-2025 11:14:00 PM

ప్రణాళిక బద్దంగా చదివి మంచి ర్యాంకులు సాధించాలి..

కలెక్టర్ జితేష్ వి పాటిల్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి):  విద్యార్థులు పరీక్షలంటే ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రణాళిక బద్దంగా చదివితే మంచి ర్యాంకుల తప్పక సాధించవచ్చని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థీనీ విద్యార్థుళకు ప్రేరణ శిక్షణ తరగతులు స్థానిక అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ... విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలు అంటే మానసికంగా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా చదువుకోవాలన్నారు. మిగిలి ఉన్న 40 రోజులు చాలా కీలకమని సబ్జెక్టుల వారిగా రోజు రివిజన్ చేసుకోవాలన్నారు. గత సంవత్సర ప్రశ్నపత్రాలు విశ్లేషించుకోవాలని, పాఠ్యాంశాలు మరోసారి పునశ్చరణ చేసుకోవాలని కలెక్టర్ తెలియజేశారు. విద్యార్థులకు వార్షిక పరీక్షల సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఇందిరా, విషయ నిపుణులు మారే హుస్సేన్, బిఎస్ఎన్ రెడ్డి, మోహాన్‌రావు, సైదులు, సైకాలజీ వెంకటేశ్వరబాబు తదితరులు పాల్గొన్నారు.